ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం హిందూకుష్ ప్రాంతంలో ఉందని గుర్తించారు. ఇది రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో నమోదైంది. భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి 7 గంటల 4 నిమిషాల 52 సెకన్ల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపల 192 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. పాకిస్థాన్, చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్‌లోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది. శనివారం రాత్రి జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ముందు జాగ్రత్తగా ప్రజలంతా తమ ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది.
ホーム
/
Uzbekistan
/
ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు
السبت، 27 يونيو 2026
and Kyrgyzstan as well china Magnitude 6.2 Recorded on Richter Scale Massive Earthquake in Afghanistan Tajikistan Tremors were reportedly felt in parts of Pakistan Uzbekistan
ليست هناك تعليقات:
إرسال تعليق