జూన్ 30న టాటా సియెర్రా ఈవీ విడుదల

الأربعاء، 17 يونيو 2026

automobile business national Sierra EV was first showcased as a concept model at the 2020 Auto Expo Tata Sierra EV Launch on June 30

t f B! P L

దేశీయ మార్కెట్లో జూన్ 30న కొత్త టాటా సియెర్రా EVను టాటా మోటార్స్ ఆవిష్కరించనుంది. కొద్ది నెలల క్రితం విడుదలైన టాటా సియెర్రా SUVకి ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా రానుంది. సియెర్రా EVను తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించారు. అనంతరం 2023 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ దీనికి అప్‌డేటెడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది.  కొత్త సియెర్రా ఈవీ డిజైన్ చాలా వరకు పెట్రోల్-డీజిల్  మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి పలు మార్పులు చేయనున్నారు. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్‌తో పాటు EVలకు ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్లు ఉండే అవకాశముంది. అలాగే టాటా ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే ".ev" బ్యాడ్జింగ్ కూడా ఈ ఎస్‌యూవీలో కనిపించనుంది. సియెర్రా ఈవీ క్యాబిన్ అత్యాధునిక సాంకేతికతతో పాటు ప్రీమియం ఫినిషింగ్‌తో రానుంది. ఇంటీరియర్ లేఅవుట్ ICE మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. టాప్ వేరియంట్‌లో మూడు స్క్రీన్ల సెటప్ అందుబాటులో ఉండవచ్చు. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు ప్రయాణికుడి కోసం అదనంగా 12.3 అంగుళాల డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. బేస్, మిడ్ వేరియంట్లలో డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో పాటు హెడ్-అప్ డిస్ప్లేను కూడా అందించవచ్చు. కొత్త టాటా సియెర్రా EVలో పలు ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. ఈవీను కంపెనీ కొత్త acti.ev+ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను హారియర్ EVలో కూడా ఉపయోగించారు. మార్కెట్ నివేదికల ప్రకారం, ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు లభించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీను రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. AWD వెర్షన్‌లో పెద్ద 75 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ