జూన్ 30న రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో విడుదల

الأحد، 28 يونيو 2026

9.06-inch OLED display that supports a 185Hz refresh rate Red Magic Tablet 5 Pro Launching on June 30 technology

t f B! P L

చైనా మార్కెట్‌లో జూన్ 30న రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో విడుదలకానున్నది.  విడుదలకు ముందే కంపెనీ టీజర్ విడుదల చేయడంతో పాటు కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది. అత్యాధునిక హార్డ్‌వేర్, హై-రిఫ్రెష్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో 9.06 అంగుళాల OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ 185Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇస్తుంది. అలాగే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఇండోర్, అవుట్‌డోర్‌లోనూ అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా DTS Ultra 3D Audio సపోర్ట్ ఉండటంతో గేమింగ్, సినిమాలు, మ్యూజిక్ వినేటప్పుడు మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. ఈ గేమింగ్ ట్యాబ్లెట్‌లో 8300mAh భారీ బ్యాటరీను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే ట్యాబ్లెట్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ USB Type-C పోర్టులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ట్యాబ్లెట్‌ను ఛార్జ్ చేయడమే కాకుండా, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. అవసరమైతే ఈ ట్యాబ్లెట్‌ను పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా సులభంగా రన్ చేయడానికి ఈ చిప్‌సెట్ ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు గేమింగ్ చేసినప్పుడు ట్యాబ్లెట్ వేడెక్కకుండా ఉండేందుకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ను కంపెనీ అందిస్తోంది. దీంతో ఫ్రేమ్ డ్రాప్స్ తగ్గి, గేమింగ్ పనితీరు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ముందుగానే PC Gaming Emulatorను కూడా ఇన్‌స్టాల్ చేసి ఇవ్వనున్నట్లు సమాచారం. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ