భవిష్యత్తులో ఐటీ పరిశ్రమను శాసించబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్ కు తెరతీసింది. ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా లేఆఫ్స్ చేపట్టింది. సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ఆధారిత మార్పుల వల్ల రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఒరాకిల్‌లో చోటు చేసుకున్న తాజా పునర్వ్యవస్థీకరణ వల్ల కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 13 శాతం తగ్గిపోయింది. గత ఏడాది 1,62,000 గా ఉన్న సిబ్బంది సంఖ్య ఈ ఏడాది మే 31 నాటికి 1,41,000 కు పడిపోయిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి కంపెనీ తీసుకుంటున్న వ్యూహాత్మక మార్పుల వల్లే ఈ భారీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం వెల్లడించింది. వ్యాపార నిర్వహణ అంతటా ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్లే ఉద్యోగులను తగ్గించాల్సి వచ్చిందని ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో పాటు మేనేజ్‌మెంట్ విధానపరమైన నిర్ణయాలు, ఉత్పత్తుల పునర్వ్యవస్థీకరణ, వ్యూహాత్మక మార్పులు, వివిధ కంపెనీల టేకోవర్ ప్రక్రియ కూడా ఈ లేఆఫ్స్‌కు కారణాలు అయ్యాయి. ఏఐ విస్తరణతో భవిష్యత్తులోనూ ఇదే తరహా సిబ్బంది తగ్గింపు చర్యలు కొనసాగే అవకాశం ఉందని ఒరాకిల్ స్పష్టం చేసింది. ఒకప్పుడు డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థగా ఉన్న ఒరాకిల్ ఇప్పుడు నూతన రూపాన్ని సంతరించుకుంది. క్లౌడ్, ఏఐ రంగాల్లో ఓ ప్రధాన శక్తిగా మారడానికి ప్రయత్నిస్తోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏఐ డేటా సెంటర్లను ఒరాకిల్ నిర్మిస్తోంది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ క్లయింట్ల కోసం అత్యాధునిక మౌలిక వసతులను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఒరాకిల్ బిలియన్ల కొద్దీ నిధులను ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఒరాకిల్ అంచనా వేస్తోంది. ఈ నిధుల సేకరణ కోసం అప్పులు చేయడంతో పాటు బాండ్ల ద్వారా సుమారు 40 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
21,000 మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్
الثلاثاء، 23 يونيو 2026
000 employees mobilize significant funds for building AI infrastructure Oracle Lays Off 21 technology technology poised to dominate the IT industry in the future
ليست هناك تعليقات:
إرسال تعليق