దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య రవాణా సేవలను మరింత బలోపేతం చేసేందుకు మరియు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా (జేపీ నడ్డా) ‘జాతీయ అంబులెన్స్ సేవ’ నూతన మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త మార్గదర్శకాల ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇకపై అంబులెన్స్ సేవలు ఒకే విధమైన ఉన్నత ప్రమాణాలతో నిర్వహించబడతాయి. దీనివల్ల రాష్ట్రాల సరిహద్దులతో సంబంధం లేకుండా రోగులందరికీ ఒకే నాణ్యత కలిగిన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ,మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య సేవలను వేగంగా విస్తరించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా తీసుకువచ్చిన కొన్ని కీలక సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి అంబులెన్స్‌కు జీపీఎస్ తప్పనిసరి చేయడం ద్వారా, అది ఎక్కడ ఉందో కంట్రోల్ రూమ్ నుండి సులభంగా ట్రాక్ చేయవచ్చు. దేశవ్యాప్త అత్యవసర నంబర్ ‘112’తో ఈ అంబులెన్స్ సేవలను పూర్తిగా అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రజలు ఒకే నంబర్ ద్వారా వేగంగా సేవలను పొందవచ్చు. దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చే అంబులెన్స్‌లను ఏఐఎస్-125 ప్రత్యేక భద్రతా, రవాణా ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేయాల్సి ఉంటుంది. ప్రమాదాలు లేదా తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులకు “గోల్డెన్ అవర్” లోపల నాణ్యమైన వైద్య రవాణా సేవలను అందించడమే ఈ ‘జాతీయ అంబులెన్స్ సేవ-2026’ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నూతన విధానం ద్వారా దేశంలో అత్యవసర సమయాల్లో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
'జాతీయ అంబులెన్స్ సేవ-2026' మార్గదర్శకాలు విడుదల
الثلاثاء، 30 يونيو 2026
'National Ambulance Service-2026' Guidelines Released national Union Health Minister JP Nadda officially released
ليست هناك تعليقات:
إرسال تعليق