జపాన్‌లోని కాకమిగహారాలో జరుగుతున్న ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల యువ హాకీ జట్టు సత్తా చాటింది. దక్షిణ కొరియా జట్టుతో సోమవారం జరిగిన పూల్ 'ఎ' మ్యాచ్‌లో కేతన్ కుశ్‌వహా సారథ్యంలోని భారత బృందం 4-1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వరీందర్ సింగ్ (5వ నిమిషంలో), షారుఖ్ అలీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెపె్టన్ కేతన్ (3వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. కొరియా జట్టుకు యున్ జేహైక్ (21వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించింది. ఇందులో రెండింటిని భారత్ సద్వినియోగం చేసుకొని, మూడింటిని వృథా చేసుకుంది. కొరియా జట్టు తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని గోల్‌గా మలిచి, మరో దానిని వృథా చేసింది. ఐదు జట్లున్న పూల్ 'ఎ'లో భారత్ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడి ఆరు పాయింట్లతో కొరియా, జపాన్ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పూల్ 'ఎ', పూల్ 'బి'లలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్ : దక్షిణ కొరియాపై గెలిచిన భారత్
الثلاثاء، 2 يونيو 2026
Asia Cup Under-18 Hockey Tournament India Defeats South Korea India has completed three matches japan Kakamigahara national sports
ليست هناك تعليقات:
إرسال تعليق