తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసింది. వాదనలు ముగిశాక మూడు నెలల లోపే తీర్పు వెలువరించాలని స్పష్టం చేసింది. జడ్జీలు నిబంధనలు పాటించకపోతే ఆ కేసులను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. హైకోర్టుల్లో కేసుల జాప్యం, తీర్పుల ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ పూర్తయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన 3 నెలల లోపు ఖచ్చితంగా తీర్పు చెప్పాలని తేల్చి చెప్పింది. బెయిల్ ఉత్తర్వులను వీలైనంత వరకు మరుసటి రోజే ప్రకటించాలని, అదే రోజు జైలుకు పంపాలని ఆదేశించింది. బెయిల్ వచ్చిన అండర్ ట్రయల్ ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని తెలిపింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీని హైకోర్టు వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని అంది. కోర్టులో ముఖ్యాంశం ప్రకటించిన ఏడు రోజుల్లోగా పూర్తి కారణాలతో కూడిన తీర్పును అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా తీర్పు కారణాలను వెబ్‌సైట్‌లో పెట్టకపోతే.. ఆ కేసును వేరే కొత్త బెంచ్‌కు బదిలీ చేయవచ్చని అంది. ఈ ఉత్తర్వులను అన్ని హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూర్తుల ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జనరల్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులకు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసిన సుప్రీంకోర్టు
الجمعة، 29 مايو 2026
'Binding' Guidelines to High Courts clarified that judgments must be delivered within three months of the conclusion of arguments national Supreme Court Issues Strict
ليست هناك تعليقات:
إرسال تعليق