పెరూలో లభించిన ఈ వింత ఆకారపు పుర్రెలు మానవ జాతికి చెందినవి కావని, అవి గ్రహాంతరవాసుల పూర్వీకులకు చెందినవి కావచ్చుననే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 'లిబర్టీ యూనివర్సిటీ' పరిశోధకులు ఈ మమ్మీలపై సరికొత్తగా జరిపిన డీఎన్‌ఏ అనాలిసిస్ సైతం విఫలం కావడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది. 1920వ దశాబ్దంలో పెరూ తీరప్రాంతంలో పరాకాస్‌ అనే ఏడాదిలో పరిశోధకులు కొన్ని వందల సంఖ్యలో వింతైన మమ్మీలు లభించాయి. ఈ వింత మమ్మీల్లో పరిశోధకులను ఆకట్టుకున్నది పొడవైన పుర్రెలే. శంఖం ఆకృతిలో పొడవుగా ఉన్న ఈ పుర్రెలు సాధారణ మనిషికంటే భిన్నంగా ఉండటంతో ఆసక్తి పెరిగింది. ఈ పుర్రెను క్రీస్తుపూర్వం 100వ శతాబ్ధానికి చెందినవిగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిపై పరిశోధనలు చేసిన కొందరు పరిశోధకులు ఓ వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. క్రీస్తుపూర్వం పెరూ ప్రాంతానికి చెందిన ఉన్నత హోదా, రాజరికపు గుర్తింపు ఉన్నవారు బాల్యం నుంచే తలపై బలమైన పట్టీలు కట్టి పుర్రె ఆకారంలో మార్పులు చేసేవారనే వాదనను తీసుకొచ్చారు. అయితే, ఈ పుర్రెలను ఆధారం చేసుకొని ఆధునికంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించగా పుర్రెలోని జన్యువులు అసాధారణంగా ఉన్నట్టుగా తేలింది. మనిషి జన్యువులతో ఇవి మ్యాచ్‌ కాలేదు. ఈ పుర్రెలు భూమిపై నివశించిన అపరిచిత హ్యుమనాయిడ్స్‌ లేదా గ్రహాంతరవాసులవో అయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మమ్మీల మూలాలను శాస్త్రీయంగా తేల్చేందుకు వర్జీనియా పరిశోధకురాలు అబిగైల్ మెక్‌డోవెల్ నేతృత్వంలోని బృందం ఒక వినూత్న ప్రయత్నం చేసింది. ఈసారి మమ్మీల జుట్టు లేదా చర్మానికి బదులుగా, వాటి పంటి లోపల సురక్షితంగా ఉండే పల్ప్ నుండి డీఎన్‌ఏను సేకరించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం వారు రెండు రకాలైన పరీక్షలు నిర్వహించారు. పంటి లోపలి భాగం నుంచి కొద్దిపాటి పొడిని సేకరించగా అందులో 2.3 యూనిట్ల డీఎన్‌ఏ లభించింది. అదేవిధంగా పంటిని పొడిగా చేసి దాని నుంచి 14.1 యూనిట్ల డీఎన్‌ఏను సేకరించారు. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఒక పురాతన జీవి జన్యు క్రమాన్ని పూర్తిగా ల్యాబ్‌లో పునర్నిర్మించి, అది ఏ జాతికి చెందినదో ఖచ్చితంగా ప్రకటించాలంటే కనీసం 20 యూనిట్ల డీఎన్‌ఏ లభించాలి. 20 యూనిట్ల డీఎన్‌ఏ కంటే తక్కువ డీఎన్‌ఏ లభిస్తే దాని నుంచి పూర్తి జన్యుక్రమాన్ని నిర్మించడం కష్టం అవుతుంది. కానీ, ఈ పురాతన మమ్మీల కోన్‌ హెడ్స్‌ నుంచి కేవలం 14.1 యూనిట్ల డీఎన్‌ఏ మాత్రమే లభ్యమైంది. ఇప్పటి వరకు భూమిపై నివశించిన మనుషులకు సంబంధించిన పుర్రెల్లో 20 యూనిట్లకు పైగానే డీఎన్‌ఏ లభించింది. దీని ఆధారంగా అది ఏ జాతికి చెందిందో గుర్తించేవారు. కానీ, పెరూలో లభించిన ఈ పుర్రెల్లో కేవలం 14.1 యూనిట్ల డీఎన్‌ఏ మాత్రమే లభ్యం కావడంతో ఈ పుర్రెలు గ్రహాంతవాసులకు చెందినవై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم