తెలంగాణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్ కుంభకోణాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా మైనింగ్ కుంభకోణం కేసును సీఐడీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق