ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం సమీపంలోని హైదరాబాద్- బెంగళూరు రాప్తాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. మధ్యప్రదేశ్ నుండి కేరళకు వలస కూలీలతో వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాప్తాడు జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న వాహనం : ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق