ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యి హైదరాబాద్ మెట్రో ఫేస్ టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన నేపథ్యంలో, దానికి త్వరగా సాంకేతిక మరియు ఆర్థిక ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తూ సుమారు 122.9 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ఫేజ్-2 ప్రాజెక్టు , అన్ని ప్రముఖ ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని సీఎం స్పష్టం చేశారు. గతంలో ఎల్ అండ్ టీ చేతుల్లో ఉన్న మెట్రో ఫేజ్-1ని రాష్ట్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుందని సీఎం గుర్తు చేశారు. దీంతో ఫేజ్-2, ఫేజ్-3 పనులు మరింత వేగంగా, ఆటంకాలు లేకుండా పూర్తి చేయవచ్చన్నారు. అందుకు కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు. ప్రభుత్వ నియంత్రణలో మెట్రో నెట్వర్క్ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించటానికి పాటుపడే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మెట్రో ఫేస్ టు నిర్మాణానికి సహకరించండి : కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
الخميس، 7 مايو 2026
CM Revanth Reddy Appeals to Union Minister Manohar Lal Khattar Cooperate on Metro Phase-II Construction national telangana
ليست هناك تعليقات:
إرسال تعليق