ముంబైలోని భేండీ బజార్ ప్రాంతంలో జరిగిన దొకాడియా కుటుంబం విషాదాంతం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎట్టకేలకు ఛేదించింది. అంతా అనుకున్నట్లు వారి ప్రాణాలు తీసింది పుచ్చకాయ కాదు, అత్యంత ప్రమాదకరమైన 'జింక్ ఫాస్ఫైడ్' అనే ఎలుకల మందని నివేదికలో తేలింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ విషాద ఘటన పోలీసులకు పెను సవాలుగా మారింది. ఆహారంలో విషం ఉందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో కలినాలోని ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు వేచి చూశారు. బాధితులు వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరంలో విషం మోతాదు చాలా తక్కువగా ఉంది. ఆ చిన్నపాటి ఆనవాళ్లను పట్టుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఏకంగా 54 రౌండ్ల పాటు, 11 రోజుల సుదీర్ఘ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు మృతుల కాలేయం, మూత్రపిండాలు మరియు కడుపులోని నమూనాలలో జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం జింక్ ఫాస్ఫైడ్ శరీరంలోకి వెళ్లగానే 'ఫాస్ఫైన్' అనే విషవాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మనిషి ఊపిరాడక విలవిలలాడుతాడు. ఈ విషప్రయోగం వల్ల మొదట 12 ఏళ్ల చిన్నారి జైనబ్ మరణించగా, చివరగా కుటుంబ యజమాని అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. బాధితులు లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లినా, అప్పటికే విషం రక్తంలో కలిసిపోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసులో ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న. పుచ్చకాయలోకి విషం ఎలా ప్రవేశించింది? బయటి నుంచి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించే అవకాశం లేదని ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారు. పండు బయటి భాగం కలుషితం కాలేదని, విషం లోపలే ఉందని తేలింది. దొకాడియా నివసించే మొఘల్ బిల్డింగ్‌లోని వారి ఇంట్లో ఎక్కడా ఎలుకల మందు ఆనవాళ్లు దొరకలేదు. విక్రయించిన చోటే పండులోకి విషం చేరిందా? లేక ఎవరైనా కావాలనే పండులో విషం కలిపారా? అనే కోణంలో డీసీపీ డాక్టర్ ప్రవీణ్ ముండే నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.
ముంబై పుచ్చకాయ తిని మృతి చెందిన కేసు : ఫోరెన్సిక్ రిపోర్ట్ లో పుచ్చకాయలో ఎలుకల మందు
الجمعة، 8 مايو 2026
'Zinc Phosphide Forensic Report Reveals Presence of Rat Poison in Watermelon maharashtra Mumbai Watermelon Death Case tests spanning 54 rounds over a period of 11 days
ليست هناك تعليقات:
إرسال تعليق