జర్నలిజంలో అత్యున్నత పురస్కారంగా భావించే పులిట్జర్ ప్రైజ్ ఈ ఏడాది ముంబైకి చెందిన ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే, జర్నలిస్టు సుపర్ణా శర్మ, బ్లూమ్‌బర్గ్ రిపోర్టర్ నటాలీ ఒబికో పియర్‌సన్ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నారు. దక్షిణ ఆసియాలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేర ముఠాల పనితీరుపై వీరు ‘ట్రాప్డ్’ అనే పేరుతో అద్భుతమైన కథనాన్ని అందించారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఒక భారతీయ న్యూరాలజిస్టును సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారనే అంశాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ కథనంలో గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కలయికను పులిట్జర్ బోర్డు ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆనంద్ ఆర్కే గీసిన బలమైన విజువల్స్ ఈ స్టోరీకి ప్రాణం పోశాయి. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో మరో భారతీయ జర్నలిస్టు అనిరుద్ద్ ఘోసల్ కూడా పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. అమెరికా సరిహద్దుల్లో పోలీసులు ఉపయోగిస్తున్న నిఘా సాంకేతికతపై ఆయన చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది.
పులిట్జర్ ప్రైజ్ ను గెలుచుకున్న ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మ
الثلاثاء، 5 مايو 2026
jointly won this year national Pulitzer Prize Winners: Anand RK and Suparna Sharma Regarded as the highest honor in journalism
ليست هناك تعليقات:
إرسال تعليق