ఏఐని రోల్ అవుట్ చేసిన స్టార్‌బక్స్

الجمعة، 22 مايو 2026

' Developed in partnership with 'NomadGo Global coffee chain science Starbucks Rolls Out—and Retires—AI technology

t f B! P L


గ్లోబల్ కాఫీ చైన్ 'స్టార్‌బక్స్' తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఏఐ ఇన్వెంటరీ టూల్‌ను కేవలం తొమ్మిది నెలలకే అట్టర్ ఫ్లాప్‌గా ప్రకటిస్తూ నిలిపివేసింది. స్టోర్లలో మిల్క్, సిరప్స్ వంటి ప్రొడక్ట్స్ కొరతను అధిగమించేందుకు, ఇన్వెంటరీ కౌంటింగ్‌ను సులభతరం చేసేందుకు 'నోమాడ్‌గో' భాగస్వామ్యంతో తెచ్చిన ఈ ఆటోమేటెడ్ కౌంటింగ్ ఏఐ సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్ 2025లో నార్త్ అమెరికా అంతటా రోల్ అవుట్ చేశారు. టాబ్లెట్స్, మొబైల్ కెమెరాల ద్వారా షెల్ఫ్‌లలోని ఐటమ్స్‌ను స్కాన్ చేసి స్టాక్ వివరాలను తెలుసుకోవడం ఈ ఏఐ టూల్ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఉద్యోగుల సమయం ఆదా అవుతుందని భావించారు. కానీ ఈ ఏఐ యాప్ పదే పదే తప్పుడు లెక్కలు చూపించడం మొదలుపెట్టింది. వేర్వేరు బ్రాండ్ల పాలను గుర్తించడంలో కన్ఫ్యూజ్ అవ్వడం, కొన్ని ఐటమ్స్ అసలు లెక్కించకపోవడం వంటి బగ్స్ వల్ల స్టోర్లలో గందరగోళం ఏర్పడింది. దీంతో మే 18న సరిగ్గా పనిచేయని ఈ ఏఐ సిస్టమ్‌ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు స్టార్‌బక్స్ ప్రకటించింది. స్టార్‌బక్స్ కొత్త సీఈఓ బ్రైన్ నికోల్ నేతృత్వంలో 'బ్యాక్ టు స్టార్‌బక్స్' పేరిట కంపెనీని లాభాల్లోకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నెలలో కంపెనీ గడిచిన రెండున్నరేళ్లలోనే అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసినప్పటికీ.. భారీ పెట్టుబడుల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్లు 18% నుంచి 9.9%కి పడిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఇటీవల అమెరికాలోని ఆఫీసులను మూసివేస్తూ 300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు ఫిబ్రవరిలోనూ 1,100 మందిని తీసేసింది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని కూడా కంపెనీ పేర్కొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ