రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థపై చీటింగ్ కేసు నమోదు

الثلاثاء، 26 مايو 2026

business Cheating Case Registered Against Reliance Home Finance Mumbai Police initiated this action following a complaint filed by Axis Bank officials national

t f B! P L


రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ మాజీ డైరెక్టర్‌పై ముంబైలోని కుఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు ఆరోపణలపై యాక్సిస్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ తమ ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉందంటూ నకిలీ, తప్పుడు పత్రాలను సృష్టించి యాక్సిస్ బ్యాంక్ నుంచి భారీగా రుణం పొందింది. అయితే, ఏ అవసరం కోసమైతే ఈ లోన్ తీసుకున్నారో.. ఆ నిధులను వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర షెల్, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడిగా మళ్లించారు. ఈ రకమైన మోసపూరిత విధానాల ద్వారా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ యాజమాన్యం తమ బ్యాంకుకు సుమారు రూ. 150 కోట్ల మేర ఫ్రాడ్ చేసిందని, తీవ్ర ఆర్థిక నష్టాన్ని చేకూర్చిందని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులు పోలీసులకు వెల్లడించారు. బ్యాంక్ అంతర్గత విచారణలో ఈ దగా బయటపడటంతో, కుఫ్ పరేడ్ పోలీసులు మాజీ డైరెక్టర్‌తో పాటు పలువురు కీలక అధికారులపై ఐపీసీ/బీఎన్‌ఎస్ పరిధిలోని ఫోర్జరీ, మోసం కేసుల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ