ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు రత్నాలలా మెరిశాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా చేనేత కార్మికుల అద్భుత సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది. ఈ చారిత్రాత్మక వేడుకలో భారతదేశ సాంస్కృతిక బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ డిజైన్ల వస్త్రాలు ధరించి రెడ్ కార్పెట్ పై వాక్ చేసి అందరినీ అబ్బురపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరొందిన తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంత చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రష్మీ ఠాగూర్‌ను తెలంగాణ చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో జరిగిన 79వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2026లో మన ఇక్కత్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ కూచర్ దుస్తులను రష్మీ ఠాకూర్ ఈ వేదికపై ధరించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై రత్నాలలా మెరిసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు !
الجمعة، 22 مايو 2026
national Pochampally Ikat Attire Shimmers Like Jewels on the Cannes Film Festival Red Carpet Rashmi Thakur India’s Cultural Brand Ambassador
ليست هناك تعليقات:
إرسال تعليق