తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి నుంచి ఏకంగా రూ. 94.11 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. గత ఏడాది నవంబర్ నెలలో బాధితుడు ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఒక ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ పేరుతో ఉన్న ప్రకటన కనిపించింది. తక్కువ పెట్టుబడితో లక్షల లాభాలు వస్తాయన్న మాటలు నమ్మి ఆయన అందులోని లింక్‌ను క్లిక్ చేశారు. వెంటనే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. తాము అంతర్జాతీయ ట్రేడింగ్ నిపుణులమని నమ్మబలికి, ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. ఆ యాప్‌లో చమురు, బంగారం స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. మొదట చిన్న మొత్తంలో ట్రేడింగ్ చేయించి, యాప్‌లో లక్షల్లో లాభాలు వస్తున్నట్లు నకిలీ గ్రాఫిక్స్‌ను చూపించారు. అది నిజమైన లాభమే అని నమ్మిన బాధితుడు తన దగ్గర ఉన్న పొదుపు మొత్తంతో పాటు, ఆస్తులు అమ్మి ,అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టారు. 2025 నవంబర్ 6 నుండి 2026 మార్చి 23 మధ్య. ఆర్‌టీజీఎస్ ద్వారా వివిధ విడతల్లో రూ. 94.11 లక్షలు బదిలీ చేశారు. పెట్టిన పెట్టుబడికి కోట్లలో లాభం కనిపిస్తుండటంతో, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించారు. అయితే, అక్కడే అసలు మోసం బయటపడింది. డబ్బు తీసుకోవాలంటే ట్యాక్సులు, కమిషన్లు, ప్రాసెసింగ్ ఫీజుల పేరిట మరిన్ని లక్షలు చెల్లించాలని నిందితులు డిమాండ్ చేశారు. వారు అడిగినవన్నీ చెల్లించినా రూపాయి కూడా వెనక్కి రాకపోవడంతో, చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు మే 1న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ లైన్‌మెన్ నుంచి రూ. 94.11 లక్షలను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
الثلاثاء، 5 مايو 2026
Cyber Criminals Swindle ₹94.11 Lakhs from Telangana Electricity Distribution Company Lineman victim was browsing Facebook
ليست هناك تعليقات:
إرسال تعليق