థాయిలాండ్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. వీసా సరళీకృతం, పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా భారత్ సహా మొత్తం 93 దేశాలు, ఇతర ప్రాంతాలకు వర్తించే '60 రోజుల ఉచిత వీసా' సౌకర్యాన్ని థాయిలాండ్ రద్దు చేసింది. ఈ మేరకు వీసా నిబంధనల్లో మార్పులకు థాయిలాండ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నిబంధనలు, స్పష్టమైన చట్టాలు, మరింత సులభతరమైన ఎంట్రీ విధానంపై థాయ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భారతీయుకు ఇది ఒక పెద్ద షాక్‌గానే చెప్పాలి. ఎందుకంటే జూలై 2024 లోనే ఈ 60 రోజుల ఉచిత వీసా సదుపాయాన్ని పొడిగించారు. థాయిలాండ్ విదేశాంగ శాఖ ప్రకారం మే 19, 2026 న థాయిలాండ్ క్యాబినెట్ ఈ సవరించిన వీసా మినహాయింపు, 'వీసా ఆన్ అరైవల్' నిబంధనలకు ఆమోదం తెలిపింది. 'ఒకే దేశానికి ఒకే థాయ్ వీసా మినహాయింపు' అనే కొత్త విధానం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విదేశీ పర్యాటకులకు మరింత స్పష్టమైన, స్థిరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి దేశానికి లేదా ప్రాంతానికి ఒకే ఒక వీసా కేటగిరీని అనుమతిస్తుంది. దీంతో ఇప్పటి వరకు అన్ని దేశాలకు వర్తించే 60 రోజుల ఉచిత వీసా విధానం పూర్తిగా రద్దవుతుంది. అలాగే, 30 రోజుల వీసా మినహాయింపు దేశాల జాబితాను 57 నుంచి 54కి తగ్గించారు. మూడు దేశాల కోసం కొత్తగా 15 రోజుల వీసా ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు. 'వీసా ఆన్ అరైవల్' దేశాల సంఖ్య 31 ఉండగా, వాటిని నాలుగు పరిమితం చేశారు. ఈ కొత్త నిబంధనలు అధికారికంగా 'రాయల్ గెజెట్'లో ప్రచురించి 15 రోజుల తర్వాత అమలులోకి వస్తాయి.
60 రోజుల ఉచిత వీసాను రద్దు చేసిన థాయ్‌లాండ్
الجمعة، 22 مايو 2026
including India international other regions part of measures aimed at visa simplification and restructuring Thailand Revokes 60-Day Free Visa Facility total of 93 countries
ليست هناك تعليقات:
إرسال تعليق