మోటో జీ 37, మోటో జీ 37 విడుదల

الثلاثاء، 19 مايو 2026

business Moto G37 and Moto G37 Released smart phones specific focus on budget-conscious users technology

t f B! P L

Motorola G37 Power Unboxing, specifications & launch date 

దేశీయ మార్కెట్లో మోటో జీ 37,  మోటో జీ 37 లను ఈరోజు మోటోరోలా విడుదల చేసింది. బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని మోటోరోలా ఈ రెండు ఫోన్లు లాంచ్ చేసింది.  మోటో జి 37 స్మార్ట్ ఫోన్ ను రూ. 13,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు జి 7 స్మార్ట్ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా మే 25వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై రూ. 800 రూపాయల ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ మరియు ఫ్లిప్ కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు MIL STD 810 మిలటరీ గ్రేడ్ సర్టిఫైడ్ డ్యూరబులిటీ ఫీచర్ తో వస్తాయి మరియు చాలా దృఢంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 6.66 ఇంచ్ HD+ డిస్ప్లేని గొరిల్లా గ్లాస్ 7i రక్షణ తో కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ కలర్ బూస్ట్ టెక్నాలజీ, 1050 నిట్స్ HBM, మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి కలిగి ఉంటాయి. ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4gb వర్చువల్ ర్యామ్ తో మొత్తం 8జీబీ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. అయితే, గోగో జి 37 ఫోన్ 64 జీబీ స్టోరేజ్ మాత్రమే కలిగి ఉంటే మోటో జి 37 పవర్ మాత్రం 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యాయి. కెమెరా పరంగా, ఈ రెండు ఫోన్లు కూడా 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు 2K (30fps) వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు Dolby Atmos మరియు Hi res ఆడియో సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్ లలో జి 37 ఫోన్ 5200 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ తో కలిగి ఉంటుంది. అయితే, జి 37 పవర్ మాత్రం 7000 mAh భారీ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ