బీహార్‌లో ఎన్‌డీయే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఈరోజు జరిగింది. మొత్తం 32 మందితో కొత్త మంత్రులతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గ విస్తరణలో మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌కు చోటు దక్కింది. కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్ విలాస్ ఎల్జేపీకి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్‌ఎం పార్టీలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పాట్నాలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, మాజీ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, లాలాన్ సింగ్, ఆర్‌ఎల్‌ఎం, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి 202 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, జేడీయూ కలిపి 174 సీట్లు సాధించాయి.
బీహార్‌లో 32 మందితో మంత్రివర్గం : తనయుడు నిశాంత్ కుమార్‌కు చోటు
الخميس، 7 مايو 2026
Bihar Cabinet Sworn In with 32 Members BJP 15 ministerial berths HAM and RLM parties each secured one ministerial post JD(U) received 13 Nitish's Son Nishant Kumar Included Ram Vilas's LJP received 2
ليست هناك تعليقات:
إرسال تعليق