ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లకు ఓటమి ఒత్తిడి నుంచి విముక్తి కలిగించేందుకు ఐదు రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా జట్టు యజమాని అంబానీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సీఎస్కే చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం తర్వాత ఆటగాళ్ల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు ముంబై యాజమాన్యం వారికి ఓ చిన్న విరామం ఇవ్వాలని నిర్ణయించింది. ముంబై తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న ఆడనుంది. అంటే మధ్యలో ఐదు రోజుల సుదీర్ఘ విరామం దొరికింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా.. ఆటగాళ్లందరినీ గుజరాత్, జామ్‌నగర్‌లోని అత్యంత విలాసవంతమైన వంతారా యానిమల్ రెస్క్యూ సెంటర్‌కు పంపించారు. ప్రకృతి ఒడిలో, జంతువుల మధ్య ప్రశాంతంగా గడుపుతూ రీఫ్రెష్ అయ్యేందుకు అంబానీ కుటుంబం ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది.
ఐదు రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు !
الجمعة، 24 أبريل 2026
cricket Enjoy Five Days with Their Families IPL Special Arrangements for the Mumbai Indians Squad sports Vantara Animal Rescue Centre in Jamnagar
ليست هناك تعليقات:
إرسال تعليق