హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో లక్షలాది మంది ముస్లింల పేర్లను న్యాయపరమైన పరిశీలన జాబితాలో ఉంచడంపై ధ్వజమెత్తారు. బరంపూర్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఏకంగా 61.6 శాతం మంది ముస్లిం పేర్లు అడ్జుడికేషన్ లిస్ట్‌లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా షంషేర్ గంజ్ నియోజకవర్గంలో 55 శాతం ముస్లింల పేర్లపై విచారణ కొనసాగుతోందని, మొతాబారి నియోజకవర్గంలో 54.2 శాతం మంది ముస్లింల పేర్లు జాబితాలో నిలిచిపోయాయని అన్నారు. మాణిక్ చక్ నియోజకవర్గంలో 50 శాతం మంది ఓటు హక్కు ప్రశ్నార్థకమైందని అన్నారు. ముస్లిం ఓటర్లందరినీ అడ్జుడికేషన్ లిస్ట్‌లో పెట్టారని, దీంతో వారు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. 'ఫారినర్స్ ట్రిబ్యునల్' వీరిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదని, అప్పటి వరకు వారు ఓటు వేయలేరని స్పష్టం చేశారు. ఎన్నికల లోపే ఫారినర్స్ ట్రిబ్యునల్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, తద్వారా నిలిచిపోయిన ఓటర్లకు న్యాయం జరుగుతుందని అన్నారు. లక్షలాది మంది పేర్లు గల్లంతయ్యాయని, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, ఎన్నికల ముందే విచారణ పూర్తి చేసి అర్హులందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
బెంగాల్ లో ముస్లింల ఓట్లు గల్లంతుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన
الأربعاء، 8 أبريل 2026
adjudication list Asaduddin Owaisi Expresses Grave Concern Over Missing Muslim Votes in Bengal national position where they are unable to cast their votes
ليست هناك تعليقات:
إرسال تعليق