ప్రియుడితో వెళ్లిన భార్య : పోలీసుల సమక్షంలోనే గొంతుకోసి చంపిన భర్త !

الاثنين، 6 أبريل 2026

crime Husband Slits Her Throat in the Presence of Police telangana Wife elopes with lover Zaheerabad area of ​​Sangareddy district

t f B! P L


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలో భార్య ప్రియుడితో వెళ్లిందని భర్త ఆమెను గొంతుకోసి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడి భార్య మార్చి 30న తన ప్రియుడితో కలిసి కనిపించకుండా పోయింది. దీనిపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఆమె జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు భర్తను వెంటబెట్టుకుని జడ్చర్లకు వెళ్లి  సదరు మహిళను అదుపులోకి తీసుకుని తిరిగి జహీరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల సమక్షంలోనే భార్యను కారులో తీసుకువస్తుండగా, మార్గమధ్యలో భార్య ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతను, ఊహించని విధంగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ దారుణ ఘటనకు పోలీసులు సైతం ఖంగు తిన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ