మే 5 నుంచి 7 వరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం వియత్నాం అధ్యక్షుడు టో లామ్ భారత్‌కు రానున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ రక్షణ, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాలలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా చర్చించుకునే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా మే 6న రాష్ట్రపతి భవన్‌ను టోలామ్‌ సందర్శించనున్నారని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే బీహార్‌లోని బోధ్‌ గయ, ముంబయిని సందర్శించనున్నారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Post a Comment

أحدث أقدم