పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆయిల్‌ సంస్థలను తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టకూడదని, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని, 21,295 కిలో లీటర్లు పంపిణి చేసినట్లు తెలిపారు. పెట్రోల్ సరఫరా 118 పెంచామని ఆయన తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Post a Comment

أحدث أقدم