పినరయి విజయన్‌కు ప్రధాని మోడీకి మధ్య చీకటి ఒప్పందాలు !


కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయన్ తనకు రాసిన లేఖలో 2014-23 మధ్య కాలంలోని అంశాలను ప్రస్తావించారని, ఆ సమయంలో ఆయన సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన పొరపాట్ల వల్లే తెలంగాణ ప్రజలు ఆయన్ను గద్దె దించారని, ఇప్పుడు కేరళ ప్రజలు కూడా విజయన్‌ను మార్చడం ఖాయమని జోస్యం చెప్పారు. పినరయి విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, గోల్డ్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయన్‌కు గాడ్‌ఫాదర్‌లా ఢిల్లీలో మోదీ ఉన్నారని, అందుకే ఆయన ఈ కేసుల నుండి తప్పించుకుంటున్నారని విమర్శించారు. దేశం కోసం ఆస్తులను, జీవితాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని కేసులతో వేధిస్తున్న కేంద్రం, కేజ్రీవాల్ వంటి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ విజయన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

إرسال تعليق

أحدث أقدم
3