హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న భూక్యా నవీన్ వర్సిటీ ఆవరణలోని ఎల్ హాస్టల్లో ఉంటున్నాడు. కాగా నవీన్ స్నేహితులైన బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న బి. శరత్ బాబు, ఘట్కేసర్ లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న ఏ. నవీన్, ఆటో డ్రైవర్ ఏ. చింటులు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి నవీన్ హాస్టల్లో ఉంటున్నారు. వీరందరూ కలిసి రాత్రి క్యాంపస్ ఆవరణలో మద్యం సేవించారు. అనంతరం వీరిలో ఒకరైన శరత్ బాబు బైక్ తీసుకొని క్యాంపస్ రోడ్ల మీదకు వచ్చాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓపీహెచ్ విద్యార్థిని లిఫ్ట్ అడిగింది. దీంతో ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన పక్కనే ఉన్న మరో పీహెచ్ విద్యార్థిని సైతం లిఫ్ట్ అడుగడంతో ఆమెను సైతం బైక్ ఎక్కించుకున్నాడు. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ వైపు వెళ్తు మార్గమద్యలో బైక్ ఆపిన శరత్ బాబు ఇద్దరు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన విద్యార్థినులు అరుస్తూ అక్కడి నుంచి పారిపోతుండగా, వారిని వెంబడించిన శరత్ బాబు ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫో న్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత విద్యార్థినులు జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులందరూ కలిసి క్యాంపస్ మొత్తం జల్లెడపట్టారు. భూక్యా నవీన్ హాస్టల్ గదిలో శరత్ బాబుతో పాటు నవీన్, చింటులు పట్టుబడడంతో విద్యార్థులు వీరిని పోలీసులకు అప్పగించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అసభ్య ప్రవర్తన, దారి దోపిడీ కింద నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ విషయం సెంట్రల్ యూనివర్సిటీలో సంచలనంగా మారింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన : నలుగురు అరెస్ట్
الأربعاء، 29 أبريل 2026
crime Four Arrested Indecent Behavior Towards Female Students at Hyderabad Central University telangana
ليست هناك تعليقات:
إرسال تعليق