జ్రాయెల్ పొరపాటున అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఇకపై ఆ దేశం ప్రపంచ పటంలోనే ఉండదంటూ చైనా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో చైనా తీసుకున్న ఈ స్టాండ్ అత్యంత కీలకమైనదిగా మారనుంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దూకుడును పెంచుతున్న కొద్దీ, అగ్రరాజ్యం అమెరికా దానికి మద్దతుగా నిలుస్తోంది. అయితే చైనా మాత్రం ఇరాన్, అరబ్ దేశాలకు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ.. ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ వద్ద ఉన్న అణ్వాయుధ సంపత్తిపై చైనా రక్షణ రంగ నిపుణులు దౌత్యవేత్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. అణ్వాయుధాల వినియోగం అనేది కేవలం ప్రాంతీయ సమస్య కాదని, అది మొత్తం మానవాళికే ముప్పు అని చెబుతూనే.. అణుబాంబు వాడితే ఇజ్రాయెల్ మనుగడనే తుడిచిపెట్టేస్తామనే సంకేతాలను చైనా పంపింది. ఈ హెచ్చరిక వెనుక చైనా దౌత్య వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడం, ఇస్లామిక్ దేశాల్లో తన పరపతిని పెంచుకోవడమే లక్ష్యంగా చైనా ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ యుద్ధం ముదిరి అణు యుద్ధానికి దారితీస్తే.. రష్యా-చైనా కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉందని ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమవుతోంది. డ్రాగన్ అరుపుకు అమెరికా ఎలా స్పందిస్తుందో అన్నది పక్కన పెడితే చైనా చేసిన ఈ న్యూక్లియర్ వార్నింగ్ మాత్రం ఇజ్రాయెల్‌ను ఆత్మరక్షణలో పడేసేలా ఉంది. 

Post a Comment

أحدث أقدم