విన్‌ఫాస్ట్ మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ‘అమియో’ అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇది కేవలం స్కూటర్ మాత్రమే కాదు, అవసరమైతే సైకిల్‌లా కూడా వాడుకోగలిగే 2-ఇన్-1 డిజైన్‌తో రావడం దీని ప్రత్యేకత. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ అయిపోతే బండి ఆగిపోతుంది. కానీ అమియోలో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే పెడల్స్ ఉంటాయి. ఛార్జింగ్ అయిపోయినప్పుడు దీనిని హాయిగా సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లవచ్చు. పట్టణాల్లోని ఇరుకైన గల్లీల్లో, ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించేలా దీనిని చాలా తేలికగా రూపొందించారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో అనుకూలం. అలాగే దీని గరిష్ట వేగం తక్కువగా ఉండటం వల్ల, దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. బరువు తక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో, పార్కింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. నగరాల్లో చిన్న రోడ్లు, గల్లీల్లో ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్‌లో 800W ఇన్-హబ్ మోటార్ ఉంటుంది. ఇది ఎక్కువ వేగం కోసం కాదు. కానీ సేఫ్‌గా, సౌకర్యంగా ప్రయాణించడానికి సరిపడేలా ఉంటుంది. దీని గరిష్ట వేగం సుమారు గంటకు 30 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 1.024 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.65,000, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. సుమారు రూ.81,000. తక్కువ దూరాలు ప్రయాణించే వారికి ఆఫీసులకు లేదా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా ప్రయాణించాలనుకునే వారికి విన్‌ఫాస్ట్ అమియో ఒక అద్భుతమైన ఎంపిక.
విన్‌ఫాస్ట్ నుంచి ‘అమియో’ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق