ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా శుక్రవారం చేసిన ప్రకటన ప్రకంపనలు రేపాయి. దీనిపై తొలిసారిగా ఆప్ ఘాటుగా స్పందించింది. పార్టీకి, ప్రజలకు వారు తీరని ద్రోహం చేశారంటూ మండిపడింది. రాఘవ్ చద్దా ప్రకటన తరువాత విలేకరుల సమావేశం నిర్వహించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వారు పార్టీకి, పంజాబ్ ప్రజలకు "ద్రోహం" చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపీగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బీజేపీ పంచన చేరాడని విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వంపై 'ఆపరేషన్ లోటస్' అమలు జరుగుతోంది. ఆపరేషన్ లోటస్ అమలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఆపరేషన్ లోటస్‌ను అమలు చేయడానికి ఈడీ, సీబీఐ సంస్థలను వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్దా : పార్టీకి, ప్రజలకు తీరని ద్రోహం చేశారంటూ మండిపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ
الجمعة، 24 أبريل 2026
Aam Aadmi Party Fumes Accusing Him of 'Irreparable Betrayal' to Party and People MP Raghav Chadha Joins BJP national Rajya Sabha MP Sanjay Singh reacted sharply
ليست هناك تعليقات:
إرسال تعليق