పాకిస్తాన్ లో లాక్ డౌన్ ? : సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు

الأربعاء، 1 أبريل 2026

commence on April 4 or 5 Lockdown in Pakistan? News Circulating on Social Media officials have drafted a proposal outlining specific regulations

t f B! P L


పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం కారణంగా ఏప్రిల్ 4 లేదా 5 నుంచి స్మార్ట్ లాక్ డౌన్ ప్రారంభం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ స్మార్ట్ లాక్ డౌన్ లో భాగంగా వీకెండ్ అంటే శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేత, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు నిషేధం, బహిరంగ సభలు, సమావేశాలు నిషేధం, రవాణాపై ఆంక్షలు.. ఇలా కొన్ని నిబంధనలతో ఓ ముసాయిదాను రూపొందించారు అధికారులు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన వీకెండ్ లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. అయితే యుద్ధం ముగిసేందుకు ఇంకా మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాకిస్థాన్ లో వినియోగదారుల సూచీ గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7 శాతం ఉండగా మార్చి పూర్తయ్యేనాటికి 7.3 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8 శాతంగా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 335 గా ఉంది. ఇక తాజాగా కిరోసిన్ ధరను దేశ ప్రభుత్వం పెంచింది. దాంతో లీటర్ కిరోసిన్ ధర ప్రస్తుతం 433 కు చేరింది. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ ను ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. వీకెండ్ లాక్ డౌన్ నిర్ణయానికి నో చెప్పడంతో రాష్ట్రాల నుంచి మద్దతు లేక కేంద్రం ఈ ప్రదిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ