కేరళకు చెందిన జి.ఎస్. శరణ్య ఆచూకీ ఎట్టకేలకు లభించడంతో ఆమెను సురక్షితంగా బేస్ క్యాంప్‌కు తీసుకువచ్చారు. ఏప్రిల్ 2వ తేదీన 15 మంది పర్యాటకుల బృందంతో కలిసి తడియాండమోల్ కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అయితే, మధ్యాహ్న సమయంలో అనుకోకుండా బృందం నుండి విడిపోయి దట్టమైన అటవీ ప్రాంతంలో ఆమె చిక్కుకుపోయారు. తాను దారి తప్పిపోయానని హోమ్‌స్టే నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ, ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఆమె ఆచూకీ కనుగొనడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో అటవీ శాఖ మరియు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం తొమ్మిది బృందాలను రంగంలోకి దించారు. అటవీ శాఖ సిబ్బందితో పాటు యాంటీ నక్సల్ స్క్వాడ్, స్థానిక గిరిజన ప్రజలు ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొన్నారు. అడవిలో నెట్‌వర్క్ లేని కారణంగా అన్వేషణ కష్టతరమవ్వడంతో, అత్యాధునిక ‘థర్మల్ డ్రోన్ కెమెరాలను’ ఉపయోగించి అడవిని జల్లెడ పట్టారు.
శరణ్య ఆచూకీ ఎట్టకేలకు లభ్యం : సురక్షితంగా బేస్ క్యాంప్‌కు తరలించిన అధికారులు
الاثنين، 6 أبريل 2026
actively participated in this operation Anti-Naxal Squad and local tribal communities Forest Department personnel Officials Safely Escort Her to Base Camp Saranya's Whereabouts Finally Traced
ليست هناك تعليقات:
إرسال تعليق