హార్మూజ్ జలసంధిని తెరిగి తెరవకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలను ఎక్కడిక్కడ పేల్చేస్తామన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరింపులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడులు చేస్తుంటే చేతులు ముడ్చుకుని చూస్తూ కూర్చొమని, తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా అదే రేంజ్ లో ప్రతిస్పందిస్తుందని ఇరాన్ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ హెచ్చరించారు. తమ దేశంపై దాడులు జరిగితే అంతే స్థాయిలో బదులిచ్చేందుకు ఇరాన్ సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మాపై దాడి చేస్తే మేం గల్ఫ్‌లోని యూఎస్ సైనిక స్థావరాలు, ఆ దేశ టెక్ కంపెనీలు, ఆయిల్ చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యంగా దాడులు చేస్తామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ట్రంప్ ఒక అస్థిరమైన, భ్రమల్లో బతికే వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. హార్మూజ్ జల సంధి ప్రపంచ దేశాలన్నింటికీ తెరిచే ఉంటుందని.. కేవలం ఇరాన్ శత్రవులకు మాత్రం హార్మూజ్ జల సంధి మూసివేసి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జల సంధిని తెరిచేందుకు విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హార్మూజ్ జల సంధిని తెరవండి రా పిచ్చి వెదవల్లారా.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ పరుష పదజాలంతో దూషించారు. సోమవారం నాటికి అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, ఒకవేళ అగ్రిమెంట్‌పై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలన్నింటినీ పేల్చివేస్తామని బెదిరించారు.
దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోం : ఎలాంటి దాడి జరిగినా అదే రేంజ్ లో ప్రతిస్పందిస్తాం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق