ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు, పుదుచేరి రాష్ట్రాలకు చెందిన హెవీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ అక్రమంగా ప్రవేశించి, స్థానిక మత్స్యకారుల వలలు ధ్వంసం చేయడం, వారి మీద భౌతిక దాడులు చేయడం వంటి సంఘటనలను నిరోధించేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆదేశాలు మరియు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సూచనలు మేరకు ఏపీ ఫిషరీస్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విభాగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు స్థానిక మత్య కారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బోట్ పెట్రోలింగ్ టీమ్స్ ద్వారా సముద్ర తీర గస్తీ చర్యలు చేపట్టబడుతున్నాయి. ఈ క్రమంలో, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి ప్రతి రోజు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లకు చెందిన మెరైన్ ఇన్స్పెక్టర్ / సబ్-ఇన్స్పెక్టర్, ఫిషరీస్, ఫారెస్ట్ శాఖల అధికారులు, సిబ్బంది మరియు స్థానిక మత్స్యకారుల సహకారంతో బోట్ పెట్రోలింగ్ నిర్వహించబడుతోంది.

Post a Comment

أحدث أقدم