హిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతిస్తామని, డీలిమిటేషన్‌ బిల్లు దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఉంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తేలేదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మాజీమంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులతో నిర్వహించిన భేటీలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. 2011లోనే తాము మహిళా రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానించినట్లు గుర్తుచేసిన ఆయన, ఆ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలపనున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాదికి 24శాతం ఎంపీ సీట్లు ఉన్నాయని, అంతకంటే తగ్గకుండా 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ బిల్లు సమగ్రంగా పరిశీలించేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. 

Post a Comment

أحدث أقدم