చట్టసభలు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ సొంతంగా చట్టాలు చేయడం లేదా చట్టాలు చేయాలని శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని నియంత్రించేందుకు మరిన్ని కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. విద్వేష ప్రసంగాలపై పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో నెలకొన్న కొన్ని సందేహాలను సుప్రీంకోర్టు నివృత్తి చేసింది. విద్వేష ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) (ప్రస్తుత బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్ 175 (3)) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులకు పూర్తి అధికారం ఉందని వివరించింది. విద్వేష ప్రసంగాల విషయంలో పోలీసులు ఫిర్యాదులను స్వీకరించకపోతే బాధితులకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను కూడా న్యాయస్థానం గుర్తుచేసింది. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుంటే, బాధితులు పైస్థాయి అధికారులను ఆశ్రయించే అవకాశం చట్టంలో ఉంది. ఫిర్యాదులపై పోలీసులు స్పందించని పక్షంలో అనుసరించాల్సిన విధానాలను సీఆర్‌పీసీ , కొత్తగా వచ్చిన బీఎన్‌ఎ్‌సఎ్‌స చట్టాల్లో స్పష్టంగా పొందుపరిచారని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాల నియంత్రణ అనేది ఇప్పటికే ఉన్న చట్టబద్ధమైన నిబంధనల అమలుపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసు యంత్రాంగం తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే కొత్త మార్గదర్శకాలతో పనిలేదని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడమే ప్రధానమని న్యాయస్థానం తన తీర్పులో నొక్కి చెప్పింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని నియంత్రించేందుకు మరిన్ని కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధులను స్పష్టం చేసింది. చట్టసభలు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ సొంతంగా చట్టాలు చేయడం లేదా చట్టాలు చేయాలని శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ధర్మాసనం గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని కోర్టు అభిప్రాయపడింది.
శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయవ్యవస్థకు లేదు : సుప్రీంకోర్టు ధర్మాసనం
الخميس، 30 أبريل 2026
Court opined that the existing criminal laws currently in force in the country Judiciary Lacks Authority to Issue Directives to the Legislature national sufficient to curb hate speech Supreme Court bench
ليست هناك تعليقات:
إرسال تعليق