హైదరాబాద్ లో జరిగిన మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీష్, షిండే, పరిస్థితి చూస్తూనే ఉన్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదన్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుందన్నారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయి.. అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. భవిష్యత్‌లో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కనపెడతారన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికే, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనన్నారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నీ చట్టాలు చేయలేం. 2/3 మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి. తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయి. తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారా ? డిక్టేటర్ షిప్‌ని ఎవరూ ఒప్పుకోరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాల సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు : మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
السبت، 18 أبريل 2026
Andhra Pradesh observed the current predicaments of leaders like Nitish and Shinde Parties That Ally with the BJP Will Not Survive Revanth Reddy in a Media Interaction telangana
ليست هناك تعليقات:
إرسال تعليق