ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ-రాయలసీమ-తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ప్రభావం విస్తరించిందని తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఆదివారం, సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Post a Comment

أحدث أقدم