ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ చేయాలన్న ప్రతిపాదనను ప్రక్కనపెట్టినా కేంద్ర ప్రభుత్వం

السبت، 18 أبريل 2026

Apple and Samsung expressed strong opposition Central Government Shelves Proposal to Pre-install Aadhaar App on Phones Reuters report technology

t f B! P L


దేశంలో విక్రయించే యాపిల్, శామ్‌సంగ్‌ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్‌సంగ్‌ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది. సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్‌ల మాదిరిగానే ఆధార్ యాప్‌ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్‌వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో సంచార్ సాథీను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ