తెలంగాణ సచివాలయంలో ఈరోజు బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి , బీసీ గురుకులాల సెక్రెటరీ సైదులు ,ఎండీ మల్లయ్య బట్టు, అలోక్ కుమార్‌లు హాజరయ్యారు. బీసీ సంక్షేమ శాఖలో పెండింగ్ అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై సమావేశంలో మాట్లాడామని తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీసీ గురుకులాల్లో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారించాలని, హాస్టళ్లు, గురుకుల పాఠశాల అద్దెలు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు చేరాలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించామని తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాలు శిక్షణ ఇచ్చిన వారికి కిట్స్ అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
الجمعة، 17 أبريل 2026
announced that a decision was taken to implement skill development programs Minister Ponnam Prabhakar Conducts Review Meeting on BC Welfare Department telangana
ليست هناك تعليقات:
إرسال تعليق