విజయవాడ నుంచి కువైట్ కి డైరెక్ట్ ఫ్లైట్

الأحد، 5 أبريل 2026

Andhra Pradesh Direct Flight from Vijayawada to Kuwait Goa Jazeera Airways introducing flight services to Lucknow madurai

t f B! P L


కువైట్ కు చెందిన ప్రతిష్ఠాత్మక జజీరా ఎయిర్‌వేస్ పౌర విమానయాన సంస్థ భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. విజయవాడ సహా నలుగు నగరాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ నాలుగు నగరాలకు కూడా జజీరా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి విమానం ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానుంది. దీంతో కువైట్, దమ్మామ్ వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు మొదలైనట్టవుతుంది. విజయవాడతో పాటు లక్నో, మధురై, గోవా నగరాలకు ఇప్పుడు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడంలో భాగంగా ఈ నాలుగు నగరాలకు కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్యాసింజర్, కార్గో రవాణా అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 13 నుండి విజయవాడకు కువైట్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా సోమ, బుధ, శుక్రవారాల్లో కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. జే9 3425 విమానం మధ్యాహ్నం 3:05 నిమిషాలకు కువైట్ నుంచి బయలుదేరి రాత్రి 11:05కు విజయవాడకు చేరుకుంటుంది. జే9 3426 విమానం రాత్రి 11:50 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి వేకువ జామున 3:10 నిమిషాలకు కువైట్ కు చేరుకుంటుంది. సమయాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ నాలుగూ అందుబాటులోకి రావడంతో జజీరా ఎయిర్‌లైన్స్ విమానాలు దేశంలో 16 నగరాలకు విస్తరించినట్టయింది. భారత్-కువైట్ మధ్య కీలక అనుసంధానంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొత్త విమానాలు సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా నడుస్తాయి. ఈ వాయు-భూ మార్గాల కలయిక ప్రస్తుత సవాళ్ల మధ్య నిరాటంక ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. వందే భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా లక్నో, విజయవాడ, మధురై, గోవా లకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జజీరా ఎయిర్‌వేస్ సీఈఓ బరాథన్ పశుపతి తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ