ఏఐ రంగంలో దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పుడు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతున్నాయి. గూగుల్ తన సరికొత్త ఓపెన్ సోర్స్ మోడల్ 'జెమ్మా 4'ను ఉచితంగా అందుబాటులోకి తేగా, తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు ఓపెన్ ఏఐ ఏకంగా ఓ ప్రముఖ మీడియా టాక్ షోను కొనుగోలు చేసింది. మరోవైపు మరో ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ కనీవినీ ఎరుగని భారీ డీల్‌తో ఏకంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టింది. ఏఐ సాంకేతికత అనేది డెవలపర్లందరికీ ఉచితంగా, పబ్లిక్ వాడకానికి అనువుగా ఉండాలనే లక్ష్యంతో గూగుల్ అపాచీ 2.0 లైసెన్స్‌తో 'జెమ్మా 4' మోడల్స్‌ను విడుదల చేసింది. కోడింగ్ రాయడం, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించడంతో పాటు రియల్ వరల్డ్ టాస్క్‌లను ఇది సులభంగా చేయగలదు. మొత్తం నాలుగు వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ మోడల్స్ చాలా తేలికైనవి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే నేరుగా మన స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లలో కూడా సులభంగా రన్ అయ్యేలా వీటిని రూపొందించడం దీని ప్రధాన ఆకర్షణ. చాట్‌జీపీటీ సృష్టికర్త 'ఓపెన్ ఏఐ'తన రూటు మార్చింది. సిలికాన్ వ్యాలీలో విశేష ఆదరణ పొందిన టెక్ టాక్ షో 'ఐబీపీఎన్'ను సొంతం చేసుకుని మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. జాన్ కూగన్, జోర్డి హేస్ హోస్ట్ చేసే ఈ షో ద్వారా.. చాట్‌జీపీటీ, అలాగే సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌పై పబ్లిక్‌లో మరింత సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. కొనుగోలు డీల్ విలువను గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ షోకి పూర్తి సంపాదకీయ స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏసీఐ)గురించి ప్రజలతో మరింత మెరుగ్గా కనెక్ట్ అయ్యేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ స్ట్రాటజీ చీఫ్ ఫిడ్జీ సిమో తెలిపారు.
ホーム
/
technology
/
ఏఐ రంగంలో అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతున్న టెక్ కంపెనీలు
الأحد، 5 أبريل 2026
Artificial General Intelligence in the future Gemma 4 Tech Companies Surge Ahead in the AI Sector with Unconventional Moves technology
ليست هناك تعليقات:
إرسال تعليق