తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా కాడ్లాపూర్‌లో తమ భూమిలను కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని కేటీఆర్ అన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1200 ఎకరాల భూమిని బలవంతంగా ప్రభుత్వం లాక్కుందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి, పేదల భూముల పైన పడిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందని, కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదనీ, ఉద్యమ కాలం నుంచే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకూ, బెదిరింపులకూ ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామన్నారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలనీ, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య : ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
الثلاثاء، 7 أبريل 2026
200 acres of land from farmers House Arrests of BRS Leaders Are a Cowardly Act Kadlapur in Ranga Reddy district KTR alleged that the government has forcibly seized 1 KTR Expresses Outrage telangana
ليست هناك تعليقات:
إرسال تعليق