2024లో గూగుల్ 'విడ్స్' ప్లాట్‌ఫామ్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇది క్రియేటర్‌లకు ఉపయోగపడుతోంది. ప్రారంభంలో కేవలం సంస్థల కోసమే ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ఇప్పుడు 'విడ్స్'లో కొత్త ఫీచర్‌లను తీసుకువచ్చింది. ఎడిటింగ్‌లో అనుభవం లేని వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. వీడియో మేకింగ్‌ను సులభతరం, వేగవంతం, మరింత సృజనాత్మకంగా మార్చడానికి కొత్త ఫీచర్‌లు ఉపయోగపడతాయి. సాధారణ టెక్ట్స్‌ప్రాంప్ట్‌లను ఉపయోగించి డిజిటల్ అవతార్‌లను మ్యానేజ్ చేసే కొత్త పద్ధతి. క్యారెక్టర్‌లను మాన్యువల్‌గా యానిమేట్ చేయడానికి బదులుగా సూచనలు టైప్ చేయడం ద్వారా అవతార్‌లు స్పందించేలా చూడవచ్చు. ఈ అప్‌డేట్‌తో యూజర్‌లు సహజమైన భాషను ఉపయోగించి ఒక సన్నివేశంలో అవతార్‌లు నటించేలా చేయవచ్చు. ఒక ప్రొడక్ట్ గురించి అవతార్ చెప్పడంలాటి వాటి గురించి క్రియేటర్‌లు చెబితే దానికి అనుగుణంగా యాప్ ఆ సీన్‌ను జనరేట్ చేస్తుంది. వ్యాపారం లేదా బ్రాండెడ్ కంటెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ప్రాంప్ట్‌ను బట్టీ అవుట్‌పుట్ మారినప్పటికీ, వీడియో అంతటా అవతార్‌లు దృశ్యపరంగా స్థిరంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లుక్‌తో కనిపించడానికి ఇది ఉపకరిస్తుంది. యూజర్‌లు క్యారెక్టర్‌లను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్‌లను ఉపయోగించి క్యారెక్టర్‌ల రూపాన్ని మార్చవచ్చు. వీడియో థీమ్‌కు సరిపోయే కొత్త నేపథ్యాన్ని జోడించవచ్చు. క్రియేటర్‌లకు మరింత సౌలభ్యాన్ని అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం. 'అవతార్' కంట్రోల్‌తో పాటు వీయో 3.1 వీడియో-జనరేషన్ మోడల్‌ని విడ్స్‌లో అనుసంధానించింది గూగుల్. ఎడిటర్‌లోనే నేరుగా షార్ట్, ఎనిమిది సెకన్‌ల వీడియోలను క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్‌లకు ఉపకరిస్తుంది. సాధారణ యూజర్‌లు నెలకు పది వీడియోల వరకు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ గత నెలలో విడ్స్ కోసం లైరియా 3, లైరియా 3 ప్రో మ్యూజిక్ మోడల్స్‌ను విడుదల చేసింది. అదనపు సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను జోడించి పూర్తి వీడియోలు రూపొందించడానికి యూజర్‌లకు వీలు కల్పిస్తుంది. యూజర్‌లు తమ స్క్రీన్ రికార్డ్ చేయడానికి క్రోమ్ ఎక్స్ టెన్షన్ డెవలప్ చేసింది గూగుల్. తద్వారా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్, డెమోనిస్ట్రేషన్స్‌ను సులభతరం చేస్తుంది.
ఎడిటింగ్‌లో అనుభవం లేని వారికి విడ్స్‌లో కొత్త ఫీచర్‌లు తెచ్చిన గూగుల్
السبت، 11 أبريل 2026
and more creative faster Google Introduces New Features in 'Vids' for Those with No Editing Experience technology video creation process simpler
ليست هناك تعليقات:
إرسال تعليق