తమ వద్ద కొత్త ఆయుధం ఉన్నదని, దాన్ని ప్రయోగిస్తే అమెరికాకు హార్ట్ అటాక్ ఖాయమని ఇరాన్ తాజాగా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆ ఆయుధం ఏంటన్న కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలు పహారా కాస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఓ అండర్‌వాటర్ సూపర్ వెపన్‌ను రంగప్రవేశం చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శత్రు దేశాల యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లకు దడపుట్టించే రీతిలో ఓ ఆయుధాన్ని తయారు చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది. అయితే డిఫెన్స్ నిపుణుల ప్రకారం హూట్ సూపర్ టార్పిడో గురించి బహుశా ఇరాన్ మాట్లాడుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ ఆ టార్పిడో గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటామని, బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాదని అనుకుంటున్నానన్నారు. హూట్ రాకెట్ టార్పిడో గురించి బహుశా ఇరాన్ చెప్పి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2006లోనే ఈ టార్పిడోను ఇరాన్ పరీక్షించింది. ఆ టార్పిడోను ప్రయోగిస్తే, శుత్రవులు దాన్ని ఆపలేరు. అంత వేగంగా బుల్లెట్‌లా అది ప్రయాణిస్తుంది. పర్షియన్ భాషలో హూట్ అంటే తిమింగళం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అతి వేగవంతమైన అండర్‌వాటర్ వెపన్ అది. రష్యా తర్వాత ఆ వెపన్ కలిగి ఉన్న రెండో దేశం ఇరాన్ కావడం గమనార్హం. రష్యాకు చెందిన వీఏ-111 ష్కివల్ వర్షన్‌ను 1990లోనే ప్రవేశపెట్టారు. సూపర్ టార్పిడోలు .. అండర్‌వాటర్ గైడెడ్ మిస్సైల్స్ లాంటివి. సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కానీ హూట్ దాదాపు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఇరాన్ చెబుతోంది. హూట్ టార్పిడో ద్వారా సుమారు 200 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న పేలుడు పదార్ధాలను వార్‌హెడ్ మోసుకెళ్లగలదు. అయితే స్పీడ్‌గా వెళ్లే ఆ టార్పిడో.. అంత భారీ మొత్తంలోని పేలుడు పదార్ధాన్ని.. అత్యంత వేగంగా పేల్చుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి హూట్ టార్పిడోలను రియల్‌టైంలో పరీక్షించలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే సూపర్ టార్పిడోలను కచ్చితమైన మార్గంలో షూట్ చేయడం కష్టమే అని అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ లాంటి యుద్ధనౌకలకు భారీ బెల్టులు ఉంటాయని, అవి భారీ టార్పిడోల నుంచి తట్టుకునే రీతిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హూట్ టార్పిడోను ఇరాన్ వాడాలనుకుంటే, అప్పుడు టార్గెట్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే పేల్చాల్సి ఉంటుంది. అంటే అమెరికా యుద్ధ నౌకలను పేల్చాలంటే, అప్పుడు ఇరానీ సబ్‌మెరైన్లు కానీ, వెసల్స్ కానీ, స్పీడ్‌బోట్లు కానీ దగ్గరగా రావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద మాత్రమే అమెరికా నౌకలను హూట్ టార్పిడోతో ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అమెరికా నౌకలు మాత్రం హోర్మజ్‌కు దూరంగా నిలిచి ఉన్నాయి. ఒకవేళ హూట్ టార్పిడోతో అటాక్ చేసినా.. లక్షల్లో ఒకటి మాత్రమే తగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ホーム
/
technology
/
ఇరాన్ కొత్త వెపన్ హూట్ సూపర్ టార్పిడో ?
الخميس، 30 أبريل 2026
international Iran has claimed to have developed a weapon designed to strike fear into the hearts of enemy warships and submarines Is Iran's New Weapon the 'Hoot' Super Torpedo? technology
ليست هناك تعليقات:
إرسال تعليق