మలేషియాలో హానర్ 600, హానర్ 600 ప్రోను హానర్ విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 1/1.4-ఇంచ్ సెన్సర్‌తో పాటు నైట్ ఇంజిన్ టెక్నాలజీ ఉండటం వల్ల లో-లైట్ ఫోటోగ్రఫీ మరింత మెరుగ్గా ఉంటుంది. HONOR 600 Proలో 50MP టెలిఫోటో లెన్స్ ఉండి 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. సాధారణ HONOR 600లో 30x జూమ్ సపోర్ట్ ఉంది. ఈ సిరీస్‌లో ముఖ్యమైన హైలైట్ AI Image to Video 2.0 ఫీచర్. ఇది మల్టీ-మోడల్ వీడియో జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. మూడు ఫోటోలను కలిపి 3-5 సెకన్ల చిన్న వీడియోలు రూపొందించవచ్చు. యూజర్లు తమకు నచ్చినట్లుగా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో స్టోరీని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే రెడీమేడ్ టెంప్లేట్లు కూడా అందుబాటులో కూడా ఉన్నాయి. హానర్ 600 ప్రోలో Snapdragon 8 Elite మొబైల్ ప్లాట్ఫారం ప్రాసెసర్ ఉండగా, HONOR 600లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. వీటితోపాటు Proలో పెద్ద 3D VC కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల గేమింగ్, హెవీ యూజ్ సమయంలో వేడి సమస్య తగ్గుతుంది. ఇంకా 6.57-ఇంచ్ OLED డిస్‌ప్లేతో ఈ ఫోన్లు వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అవుట్‌డోర్ లో కూడా క్లియర్ విజిబిలిటీ లభిస్తుంది. ఐ కంఫర్ట్ టెక్నాలజీ, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు కళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాయి. ఈ సిరీస్‌లో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. HONOR 600 Proలో అదనంగా 50W వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. HONOR 600 సిరీస్ ఫోన్లు IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తున్నాయి. అంటే ఇవి డస్ట్, వాటర్‌కు గరిష్ట రక్షణ కల్పిస్తాయి. SGS 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్ కూడా ఉండటం వల్ల ఇవి మరింత దృఢంగా ఉంటాయి. ఈ ఫోన్లు ఏప్రిల్ 30, 2026 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లలో భాగంగా.. HONOR 600 Proపై భారీ బండిల్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, వారంటీ సదుపాయాలు ఉన్నాయి.
ホーム
/
technology
/
గ్లోబల్ మార్కెట్ లో హానర్ 600, హానర్ 600 ప్రో విడుదల : ఏప్రిల్ 30 నుంచి విక్రయాలు
الخميس، 23 أبريل 2026
AI Image to Video 2.0" feature Honor 600 and Honor 600 Pro Launched in the Global Market Sales Begin April 30 technology
ليست هناك تعليقات:
إرسال تعليق