విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కు మాయ ఖాతాలు సృష్టించి తెలివిగా టోకరా వేసారు. ఈ బ్యాంకు చెందిన మూడు వేర్వేరు శాఖల్లో చీటింగ్ గాళ్ళు ఫేక్ పేస్లిప్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో ఖాతాలను సృష్టించారు. తద్వారా సుమారు రూ.5 కోట్ల నిధులు కొల్లగొట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంక్ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కు చెందిన ఏలూరు రోడ్, గుణ దల, బెంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా శాఖల్లో నకిలీ ఖాతాలు తెరిచారు. ఆ అకౌంట్లకు అనుబంధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5,28,19,939 నగదు లూటీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మోసాలకు పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రైవేటు బ్యాంకుకు రూ.5.28 కోట్ల టోకరా వేసిన కేటుగాళ్లు
الأربعاء، 1 أبريل 2026
Andhra Pradesh Conmen Swindle Private Bank of Rs 5.28 Crores in Vijayawada crime fraudsters cleverly swindled a private bank by creating fictitious accounts
ليست هناك تعليقات:
إرسال تعليق