తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా జూన్ 2 నుండి హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే బోర్డు అనుమతి కోరింది. ఎంఎంటీఎస్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో ఉన్నందున, టికెట్ల రద్దు వల్ల రైల్వేకు వచ్చే ఆదాయ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. దీనికి సంబంధించి రైల్వే అధికారులతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని, తద్వారా రోడ్లపై వాహనాల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం ఉచిత ప్రయాణంతోనే సరిపెట్టకుండా, ప్రయాణికులు ఇంటి నుండి స్టేషన్‌కు చేరుకోవడానికి అయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం లాస్ట్ మైల్ కనెక్టివిటీ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధాన ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ఆర్టీసీ షటిల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. కాలనీల నుండి స్టేషన్లకు, మళ్ళీ స్టేషన్ల నుండి కార్యాలయాలకు వెళ్ళేలా సమన్వయంతో కూడిన బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల మధ్యతరగతి, అల్ప ఆదాయ వర్గాలకు రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ నెట్‌వర్క్ మొదటి, రెండో దశలు కలిపి దాదాపు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఫలక్‌నుమా, లింగంపల్లి, సికింద్రాబాద్, మేడ్చల్, ఉందానగర్ వంటి కీలక ప్రాంతాలను కలిపే ఈ రైళ్లలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే ఐటీ ఉద్యోగుల నుండి సామాన్య కార్మికుల వరకు అందరికీ లబ్ధి చేకూరుతుంది.
జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం
الأحد، 19 أبريل 2026
Free Travel on MMTS from June 2 hyderabad reducing growing vehicular congestion in the city and curbing pollution Telangana State Formation Day
ليست هناك تعليقات:
إرسال تعليق