దేశీయ మార్కెట్లో సింపుల్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా'ను రూ.2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్‌తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్‌కు సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు. భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్‌పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది. ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.
రూ. 2.35 లక్షల ధరతో సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల : సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల మైలేజీ
الجمعة، 17 أبريل 2026
automobile business national Offers a Staggering 400 km Range on a Single Charge Simple Ultra Electric Scooter Launched at Rs 2.35 Lakhs
ليست هناك تعليقات:
إرسال تعليق