అమెజాన్ కంపెనీ వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా సాగుతున్న ఈ లేఆఫ్స్ పరంపరలో ఇది మూడవ విడత కావడం గమనార్హం. ఆసియా బిజినెస్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం ఈ లేఆఫ్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ విభాగం, హెచ్ఆర్ విభాగాల్లో పనిచేసే మిడ్-లెవల్ మేనేజర్లు, వైట్ కాలర్ ఉద్యోగులపై ఈ వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అంతేకాకుండా, చైనాలోని కొన్ని ప్రత్యేక విభాగాలను కూడా కంపెనీ పూర్తిగా మూసివేసే అవకాశం ఉందని టాక్. అమెజాన్ తన వ్యూహాలను మార్చుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. డేటా సెంటర్ల కోసం దాదాపు 125 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది. ‘జనరేటివ్ ఏఐ’ రాకతో కొన్ని రకాల ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ గతంలోనే అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో ఒక యూజర్ మే నెలలో భారీ తొలగింపులు ఉండబోతున్నాయంటూ పోస్ట్ చేయడంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది. “ఈ వార్త విన్నప్పటి నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను.. వేరే ఉద్యోగం చూసుకోవాలా?” అంటూ పలువురు ఉద్యోగులు తమ ఆవేదన కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు తొలగింపులు చేపడుతున్నారో స్పష్టత లేకపోవడం ఈ ఆందోళనకు ప్రధాన కారణం అని చాలా మంది చెబుతున్నారు.
14 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలో అమెజాన్ ?
الأربعاء، 8 أبريل 2026
Asia Business Outlook Report Is Amazon Planning to Lay Off 14000 Employees? technology third phase in a series of layoffs that has been ongoing for the past year
ليست هناك تعليقات:
إرسال تعليق